ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్’. లాల్ జెఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ అగ్ర నటులు నందమూరి బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. తాజాగా మాలీవుడ్‌లో సైతం తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో మలయాళ యువతలో మంచి క్రేజ్ ఉన్న నటుడు టోవినో థామస్ హీరోగా ‘నడిగర్’ సినిమాను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘నడిగర్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్‌లో హీరో టోవినో థామస్ సహా ఈ చిత్రంలో నటిస్తోన్న నటీనటులందరి లుక్స్ రివీల్ చేసింది. విలక్షణ కథలకు పెట్టింది పేరైన మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న చిత్రం కావడం, అందునా హీరో టోవినో థామస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ‘నడిగర్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here is the first look poster of #Nadikar ❤️
A new name to the same extraordinary story ❤️🔥
In cinemas worldwide May 3rd, 2024 💥💥@ttovino @soubinshahir #LalJr #Bhavana #BaluVarghese #SureshKrishna @MythriOfficial @Godspeedoffcl @truthglobalofcl #TeluguFilmNagar pic.twitter.com/DYy9V9dI8w
— Telugu FilmNagar (@telugufilmnagar) January 23, 2024
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: