టాప్ ట్రెండింగ్ లో సర్కారు నౌకరి

sarkaaru noukari movie tops on amazon prime

ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి సినిమా అయినా కూడా ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ఆకాష్ కు కూడా ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకోగా జనవరి 12 నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈసినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అమెజాన్ లో టాప్ 10 మూవీ లిస్ట్ లో ఆరో ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో సునీత ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సర్కారు నౌకరి సినిమా అమెజాన్ టాప్ 10 లిస్ట్ లో ఉండటం థ్రిల్ కు గురిచేసింది. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్..ఆకాష్ నటనకు ఇంత ప్రశంసలు రావం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది.. ఇంకా సినిమాను చూడకపోతే ఖచ్చితంగా చూడండి అంటూ పోస్ట్ లోపేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటించింది. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించారు. శాండిల్య సంగీతం అందించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కూడా గంగనమోని శేఖర్ పనిచేసారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.