ఊరు పేరు భైరవకోన.. నా కెరీర్‌లోనే ఛాలెజింగ్ ప్రాజెక్ట్ – దర్శకుడు విఐ ఆనంద్

Ooru Peru Bhairavakona is The Challenging Project in My Career, Says Director VI Anand

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలు- ‘నిజమే నే చెబుతున్నా’, ‘హమ్మా హమ్మా’ చార్ట్‌బస్టర్‌ హిట్స్‌గా అలరిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపధ్యంలో.. నేడు చిత్ర యూనిట్ ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసింది. గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్‌లో దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ” ‘ఊరు పేరు భైరవకోన’ నా కెరీర్‌లో ఛాలెజింగ్ ప్రాజెక్ట్. ప్రతి సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ప్రేక్షకులు వారి జీవితంలో రెండున్న గంటలు సమయాన్ని కేటాయించి ఒక సినిమా చూస్తారు. వారి సమయానికి విలువ ఇవ్వాలని కోరుకుంటాను. అందుకోసం తగిన కష్టం పడాలి. కథ, స్క్రీన్ ప్లే కొత్త కంటెంట్ ప్రయత్నించాలి. ఆడియన్స్‌కి కొత్త అనుభూతి ఇవ్వాలనేది నా భాద్యత. ‘ఊరు పేరు భైరవకోన’ ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని, ఎక్సయిమెంట్‌ని ఇస్తుంది” అని అన్నారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ఈ సినిమా కోసం సందీప్ కిషన్, నేను కలసి కొన్ని నెలల క్రితం జర్నీ మొదలుపెట్టాం. ఈ ప్రయాణంలో మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలు అనిల్ గారికి, రాజా గారికి, కిశోర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి నిర్మాతలు దొరకడం దర్శకుడిగా నా అదృష్టం. ఇక ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నికల్, డైరెక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. హీరోయిన్స్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ చాలా అద్భుతంగా నటించారు. అలాగే వీరితో పాటు చాలా మంచి స్టార్ కాస్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం ఖచ్చితంగా ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని డైరెక్టర్ విఐ ఆనంద్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =