ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో నాగార్జున నుండి రాబోతున్న నా సామిరంగ సినిమా ఒకటి. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున. కొరియోగ్రాఫర్ బిన్ని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుండగా.. ఈసినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా కాలం తరువాత నాగార్జున కూడా ఫుల్ మాస్ రోల్ తో వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ట్రైలర్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటతో వచ్చేశారు. ఈసినిమా నుండి ఇంకా ఇంకా అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎం.ఎం కీరవాణి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మమన్ కుమార్, సత్య యామిని పాటను ఆలపించారు.
Another Beautiful Melody from @mmkeeravaani garu ❤️
Listen & Enjoy #InkaInka
▶️ https://t.co/h8V0NxtjN9#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/A4oV3alP6l
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 11, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: