నా సామిరంగ విశేషాలు.. హీరోయిన్స్ ఆషిక, రుక్షర్, మిర్నా మాటల్లో

Naa Saami Ranga Actresses Ashika Ranganath, Rukshar Dhillon and Mirna Menon Praises Nagarjuna

కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శత్వం వహించారు. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో చిత్రబృందం తాజాగా ‘నా సామిరంగ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. “నా సామిరంగని సంక్రాంతికే మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఇందులో నా పాత్ర వరాలు చాలా స్పెషల్ క్యారెక్టర్. నాగార్జున గారితో పని చేయడం నా అదృష్టం. చాలా అద్భుతమైన వ్యక్తి. ఎంతగానో సపోర్ట్ చేశారు. కీరవాణి గారు సంగీతం అందిస్తున్న సినిమాలో నేను వుండటం మరో అదృష్టం. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరాలు లాంటి మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు బిన్నీగారికి ధన్యవాదాలు. శ్రీనివాస చిట్టూరి గారు, పవన్ గారు అద్భుతమైన నిర్మాతలు. నరేష్ గారు, రాజ్ తరుణ్, మిర్నా, రుక్షర్ టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ జనవరి 14న సినిమా చూడాలి’’ అని కోరారు.

హీరోయిన్  రుక్షర్ ధిల్లాన్ మాట్లాడుతూ.. “నా సామిరంగా చాలా స్పెషల్ మూవీ. ఇందులో నేను కుమారి అనే క్యూట్ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కీరవాణి గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా తోటి నటీనటులు రాజ్ తరుణ్, నరేష్ గారు, మిర్నా, ఆషిక అందరికీ థాంక్స్. నాగర్జున్ గారికి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఈ సినిమా చేస్తున్న సమయంలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నా సామిరంగ పండగ లాంటి సినిమా, తప్పకుండా అందరూ జనవరి 14న థియేటర్లలో చూడాలి’’ అని అన్నారు.

మరో కథానాయిక మిర్నా మీనన్ మాట్లాడుతూ.. అక్కినేని నాగార్జున గారితో వర్క్ చేయడం నా డ్రీమ్. అది ఈ సినిమాతో నెరవేరింది. ఆయనతో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో నెక్స్ట్ బెంచ్ మార్క్ మూవీ అవుతుంది. ఇక ఈ చిత్రంలో నాతోపాటు నటించిన నరేష్, రాజ్ తరుణ్, ఆషికా, రుక్షర్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వీరందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఇంతమంది నటులతో ఒకే సినిమాలో చేసే అవకాశం రావడం అదృష్టం. నా సామిరంగ పెర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ. తప్పకుండా అందరూ సినిమా చూడండి’’ అని కోరారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =