విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా బుధవారం మేకర్స్ ‘సైంధవ్’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో మొదలైన ట్రైలర్ నెమ్మదిగా యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో వెంకటేష్ నవ్వులు పూయించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఫన్నీగా బదులిచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అంటున్నారు.. అది ఎప్పుడు ఉండొచ్చు? అని అడుగగా.. బాబూ ఇప్పుడు ఎవరో ఒకరు వెంటనే త్రివిక్రమ్‌కి కాల్ చేసి అడగండమ్మా.. అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.
అలాగే మరొకరు ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మీరు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అని అడిగారు. దీనికి కూడా వెంకీ.. వై నాట్? నేను రెడీ.. ఇప్పుడే కాల్ చేసి అడుగుదామా? అని ఫన్నీగా ఆన్సర్ చేశారు. దీంతో అక్కడ అంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే గత రెండు రోజులుగా త్రివిక్రమ్, వెంకటేష్, నానిలు కలిసి ఒక సినిమా చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వెంకటేష్ దీనిపై కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ‘సైంధవ్’ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్‌గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా సైంధవ్ చిత్రం జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: