తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా అయలాన్. ఆర్ రవి కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ పై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమా పొంగల్ కే రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ తెలియచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జనవరి 5వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
⚠️⚠️ATTENTION⚠️⚠️
You are about to enter the exhilarating and dangerous world of #Ayalaan👽🛸 #AyalaanTrailer setting off on 5️⃣th January!
Be ready⚡ #AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman pic.twitter.com/JaAin5QuDS— Ganga Entertainments (@Gangaentertains) January 3, 2024
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: