విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. నిజానికిి అల్లరి నరేష్ ఇంట్రో వీడియో వల్ల సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Experience the Entertaining 1980’s Love Tale of Bhaskar @itsRajTarun & Kumari @RuksharDhillon 😍
Here’s the Intro Glimpse❤️
▶️https://t.co/fW54jO4E9U#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthiKING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/EH744AFJ0x
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 3, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: