ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ‘యాత్ర 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 5వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు నటుడు మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా జనవరి 5 ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్లో చైర్లో మమ్ముట్టి కూర్చుని ఉండగా.. ఆయన పక్కన జీవా నిల్చుని కనిపించారు. ఇద్దరూ ఎంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
One man, a million odds, yet the promise had to be kept!#Yatra2Teaser on Jan 5th at 11AM👣#LegacyLivesOn #Yatra2 #Yatra2OnFeb8th @JiivaOfficial @ShivaMeka @MahiVraghav pic.twitter.com/3A9nNLZjak
— Mammootty (@mammukka) January 2, 2024
కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: