దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు విజయ్ 68 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో కూడా యంగ్ విజయ్ కాస్త ఓల్డ్ విజయ్ కనిపిస్తున్నారు. ఇద్దరూ బుల్లెట్ రైడ్ చేస్తూ.. గన్ ఫైర్ చేస్తున్నారు. ఓ వైపు పిస్తోల్, మరోవైపు గన్‌ను పేలుస్తూ కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for the action! #Thalapathy with #IlayaThalapathy is #TheGreatestOfAllTime #Thalapathy68SecondLook #AGS25 #Thalapathy68 @actorvijay Sir@ags_production#KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh @vp_offl @archanakalpathi @aishkalpathi @venkat_manickam… pic.twitter.com/W6EaVRZoHE
— AGS Entertainment (@Ags_production) January 2, 2024
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: