జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గుర్తింపు.. టాలీవుడ్‌ నుంచి తొలి హీరోగా

Jr NTR Ranked 25th in Asian Weekly News Eastern Eye 2023

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగానే కాక గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు సాధించారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అచిరకాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పాటలు పాడటం, అలవోకగా డైలాగ్స్ చెప్పడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ నటనతో నాలుగు పదుల వయస్సుకే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్నారు జూ. ఎన్టీఆర్‌. అలాగే మరికొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజెస్‌లో మెరిసిన తారక్.. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రిటన్‌లోని ప్రముఖ ‘ఏషియన్ వీక్లీ’ అనే మేగజైన్ ‘ఈస్టర్న్ ఐ 2023’ పేరిట టాప్‌ 50 ఏషియన్ స్టార్స్‌ లిస్టును ప్రకటించింది. కాగా ఈ జాబితాలో జూ. ఎన్టీఆర్‌కు స్థానం లభించింది. సదరు మేగజైన్ వెల్లడించిన దాని ప్రకారం.. తారక్ ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. తద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన అరుదైన ఘనతను సాధించారు. కాగా ఇదే లిస్టులో బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ మొదటిస్థానంలో నిలిచారు. ఇక ఎన్టీఆర్ ఈ ఘనత సాధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఇక యంగ్ టైగర్ కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్​పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి పార్టు వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక భారీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =