కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమాకు కార్తీక్ దండు మేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఓటీటీ లో కూడా కొత్త రికార్డ్ సృష్టించింది. ఈసినిమా ఓటీటీలో 8.7 మిలియన్ వాచింగ్ అవర్స్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా తన నటనకు గాను ప్రశంసలు దక్కాయి. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఇంకా శామ్ దత్ సినిమాటోగ్రఫి అందించారు. ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: