నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ ఇలా ప్రతి పాత్రలోనూ తన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆది కూడా రొటీన్ గా ఉండే కథల కంటే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే ఆది నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ శబ్దం. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల నుండి ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అయితే ఇవ్వలేదు మేకర్స్. దాదాపు ఈసినిమా గురించి మరిచిపోతున్న తరుణంలో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ఆది కూడా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
In the eerie silence, #SabdhamFirstLook echoes the beginning of a symphony of horror🔊
Brace yourself for a haunting auditory experience✨#Sabdham
Starring @AadhiOfficial
An @dirarivazhagan Film
A @MusicThaman MusicalProduced by @7GFilmsSiva @Aalpha_frames pic.twitter.com/fqs5QoUlww
— 7G Films (@7GFilmsSiva) December 14, 2023
కాగా ఈసినిమాను 7జీ ఫిలింస్ ఇంకా ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: