వరుణ్ తేజ్ మట్కా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

varun tej matka movie shooting began today

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుపుకుంటున్న షూటింగ్ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ కథ 1958, 1982 మధ్య జరిగినందున, యూనిట్ 50, 80ల నాటి పరిసరాలను అద్భుతంగా రిక్రియేట్ చేస్తున్నారు. ఈసినిమాలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =