టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుపోతున్నాడు. ఇక ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే అడివిశేష్ ఈసారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటివరకూ థ్రిల్లర్ ఇంకా స్పై నేపథ్యంలో ఉన్న సినిమాలనే ఎక్కువగా చేశాడు అడివి శేష్. ఇప్పుడు ఆ రూట్ ను మార్చి ప్రేమ కథతో రాబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్షణం, గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫొటోగ్రాఫర్ గా పనిచేసిన షనైల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈసినిమాను రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుండటం అందులోనూ లవ్ స్టోరీ గా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఇప్పటినుండే పెరిగాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు టైటిల్ ను ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 18వతేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
A journey, full of the wildest experiences, will take a new turn with HIS arrival in HER life ❤️🔥
Introducing @AdiviSesh as one half of the most anticipated #SeshEXShruti 💥
Wait for ‘HER’.
Title and first look out on December 18th 🔥@shrutihaasan #ShaneilDeo… pic.twitter.com/VMhdKDMR7h
— Telugu FilmNagar (@telugufilmnagar) December 14, 2023
కాగా ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: