ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. కె.జి.యఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా రెండు భాగాలుగా వస్తుండగా సలార్-సీజ్ ఫైర్ అనే టైటిల్ తో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి క్యూరియాసిటీని రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూరీడే అంటూ వచ్చేఈపాటను తెలుగుతో పాటు పలు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో భాషల్లో రిలీజ్ చేశారు.
𝐃𝐄𝐕𝐀 & 𝐕𝐀𝐑𝐃𝐇𝐀 🔥
Listen to the #SalaarFirstSingle 🎵– https://t.co/6PDsfw6NCN#Sooreede (Telugu), #SoorajHiChhaonBanke (Hindi), #AakaashaGadiya (Kannada), #Suryangam (Malayalam), #AagaasaSooriyan (Tamil)
Music by @RaviBasrur 🎶#Salaar #SalaarCeaseFire #Prabhas… pic.twitter.com/z9D0QUV791
— Hombale Films (@hombalefilms) December 13, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: