గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చేే ఏడాది రిలీజ్ కానుంది. నీరజ కోన దర్శకత్వంలో తెలుసుకదా అనే సినిమాను కూడా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. సిద్దూ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు.
Lights! Camera! Action! 🎥#SVCC37 starts rolling with Star Boy #Siddu in the lead, under the direction of #BommarilluBhaskar. Get ready for a Hilarious entertainer! 🤩@baskifilmz @SVCCofficial pic.twitter.com/BsZ37Y0iZf
— SVCC (@SVCCofficial) December 11, 2023
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే అంచనాలు పెరిగాయి. వీరిద్దిరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు. క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: