టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్‌ను లాంచ్ చేయగా.. ఇవి చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ అండ్ క్లాసీ బీట్స్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ‘హనుమాన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డిసెంబర్ 19న ‘హనుమాన్’ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మూవీపై అంచనాలను పెంచిన నేపథ్యంలో తాజాగా హనుమాన్ టీమ్ చేసిన ప్రకటనతో ఈ చిత్రంపై మరింత బజ్ క్రియేట్ అయింది. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Time to unleash the Most Powerful Superhero in the Universe 🔥#HANUMAN TRAILER RELEASING ON DECEMBER 19th 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123In Cinemas WW From JAN 12th, 2024!@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Chaitanyaniran… pic.twitter.com/me5dbvKWje
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 12, 2023
ఇక హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మాగ్నమ్ ఓపస్‌కి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీనాగేంద్ర తంగాల వ్యవహరించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమాను మొత్తం 12 భాషల్లో డబ్ చేస్తున్నామని, కొన్ని విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: