‘ఏ మాయ చేశావే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి సమంతా రూత్ ప్రభు అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఆమె అనంతరం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆపై బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కి చేరుకుంది. ఈ క్రమంలో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది సామ్. అలాగే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఆయా భాషల్లో స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది సమంత. దీంతో అతి తక్కువ కాలంలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇక ఇటీవలే ‘సిటాడెల్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించిన సామ్.. .. మరో అమెరికన్ ఫిల్మ్ ‘చెన్నై స్టోరీస్’లోనూ నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తాజాగా సమంత ప్రొఫెషనల్‌గా మరో ముందడుగు వేసింది. కాగా ఇప్పటివరకు నటిగా సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రతిభను చూపించిన సమంత, ఇకపై తనలోని నిర్మాతను కూడా అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా ఆమె ‘Tralala Moving Pictures’ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. ఈ మేరకు ఆమె ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది.”నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటిస్తున్నందుకు ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇది మన సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే, వాటిని ప్రోత్సహించే ప్లాట్‍ఫామ్‍గా నిలవనుంది. చిత్రనిర్మాతలు అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఇది ఒక వేదిక’ అని అందులో పేర్కొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: