ఓటీటీ లోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్

Martin Luther King movie streaming on OTT now

హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు.  మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. రీసెంట్ గానే మార్టిన్ లూథర్ కింగ్ అంటూ వచ్చాడు. ఈసినిమా త‌మిళ్ కమెడియన్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయోచ్చు.

కాగా ఈసినిమాలో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మించారు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందించిన ఈసినిమాకు కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 17 =