సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుల్లో ముందువరుసలో ఉంటారు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. తాను తీసే సినిమాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. అలాగే వారు అడిగే కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ (ట్విట్టర్)లో వివిధ అంశాలకు సంబంధించి నెటిజెన్ల ప్రశ్నలకు హరీష్ శంకర్ సోషల్ పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక నెటిజెన్ ఇచ్చిన సలహాకు స్పందిస్తూ.. ట్రోలర్స్ నా స్ట్రెస్ బస్టర్స్ అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్నా, మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఎందుకు అనవసరంగా ట్రోలర్స్ కి ఆన్సర్ చేస్తూ సమయం వృథా చేసుకుంటారు? అని ఒక నెటిజెన్ ప్రశ్నించగా.. అందుకు హరీష్ శంకర్ ఇలా బదులిచ్చారు.. అమ్మో వారు లేకుంటే ఎలా? ట్రోలర్స్ నా స్ట్రెస్ బస్టర్స్ అని ఫన్నీగా చెప్పారు. ఇంకో నెటిజెన్ మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో మీ సినిమా ఎక్సపెక్ట్ చెయ్యవచ్చా అని అడుగగా.. పవర్ స్టార్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్నకు.. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ అని, ప్రజెంట్ జెనెరేషన్ లో సుకుమార్, సందీప్ రెడ్డి వంగా అని చెప్పారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక్క మాటలో చెప్పలేమని మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అందుకుంటుందా? అని ఒక నెటిజెన్ అడుగగా.. తప్పకుండా అని, అందుకు పూర్తి బాధ్యత నాది అని స్పష్టం చేశారు.
ఇక ఇదిలా ఉండగా.. హరీష్ శంకర్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: