టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ సినిమా పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ టికెట్టే కొనకుండా అన్న పాటను రిలీజ్ చేయగా ఆ పాట ఏ రేంజ్ లో వైరల్ అయిందో చూశాం. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. రాధిక అంటూ వచ్చే ఈ పాట ప్రోమో చాలా బాగుంది. ప్రోమో చూస్తుంటే ఈపాట కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది.
#Radhika.. Not just a name!! 😜
Groove to the most energetic beat of the Year – #RadhikaSongPromo Out Now🕺
🎹 & 🎤 @ram_miriyala
✍️ @LyricsShyamFull song out on 27th Nov at 04:05pm 😎#TilliSquare #Siddu @anupamahere @MallikRam99 @achurajamani… pic.twitter.com/6AknMZPh0N
— Sithara Entertainments (@SitharaEnts) November 25, 2023
కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: