రివ్యూ : ఆదికేశవ

aadi keshava movie telugu review

నటీనటులు : వైష్ణవ్ తేజ్ ,శ్రీలీల,జోజు జార్జ్ ,రాధికా శరత్ కుమార్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : డడ్లీ
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
దర్శకత్వం : శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాతలు : నాగవంశీ, సాయి,సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉప్పెనతో హీరో గా బ్లాక్ బాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఈసినిమాతో వైష్ణవ్ కు మంచి ఫేమ్ వచ్చింది. ఉప్పెన తరువాత నటించిన కొండపొలం,రంగ రంగ వైభవంగా సినిమాల్లో సాఫ్ట్ గా కనిపించాడు వైష్ణవ్.అయితే ఈసారి ఆదికేశవతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసాడు.సాంగ్స్ సూపర్ హిట్ కావడం ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమాకావడంతో ఆదికేశవఫై అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో తెలుసుకుందాం.

కథ :
బాలు(వైష్ణవ్ తేజ్) అల్లరి చిల్లరగా తిరుగుతూ గొడవలతో టైం పాస్ చేస్తుంటాడు అయితే తన తల్లి కోసం ఓ కాస్మటిక్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు.ఆకంపెనీ సీఈఓ చిత్ర (శ్రీలీల)ను చూసి మనసుపారేసుకుంటాడు.చిత్ర కూడా బాలు ను ఇష్టపడుతుంది. ఇదిలావుంటే రాయలసీమకు చెందిన చెంగా రెడ్డి (జోజు జార్జ్) చిన్న పిల్లలతో మైనింగ్స్ చేయిస్తూ ఊర్లో అరాచకాలు సాగిస్తుంటాడు.ఈక్రమంలో చెంగా రెడ్డి తో బాలు,చిత్ర గొడవ పడుతారు.ఇంతకీ వీరి మధ్య గొడవ కారణం ఏంటి ?చివరికి బాలు,చెంగా రెడ్డి అరాచకాలకు ఎలా ముగింపు పలికాడు అనేది మిగితా కథ.

విశ్లేషణ :

ప్రెస్ మీట్ లలో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ..సినిమా కొత్తగా ఏం ఉండదు రెగ్యులర్ కమర్షియల్ సినిమా కానీ ఎంటర్టైనర్ చేస్తుందని పదే పదే చెప్పాడు.సినిమా కూడా ఆలాగే వుంది.కథ రొటీన్ కానీ లీడ్ పెయిర్ యాక్టింగ్ ,డ్యాన్స్,ఫైట్స్ లతో సినిమా టైం పాస్ చేయిస్తుంది.ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ,సాంగ్స్ హైలైట్ అయ్యాయి.ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో హీరో విలన్ తో గొడవ పడడం ఆ ఊరికి వెళ్లి సమస్యను ముగించడం.క్లైమ్యాక్స్ లో వచ్చే ఫైట్ సీన్స్ మెప్పిస్తాయి.కథాపరంగా చూస్తే రెగ్యులర్ అనిపించినా ట్రీట్మెంట్ తో టైం పాస్ చేయించాడు దర్శకుడు.ఒక్క లైన్ లో చెప్పాలంటే ఓ పక్కా కమర్షియల్ సినిమా ఎలా వుంటుందో అదే ఆదికేశవ.

నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ కు ఈసినిమా బాగా హెల్ఫ్ అయ్యింది.యాక్టింగ్ పరంగానే కాదు డ్యాన్స్ ,యాక్షన్ సన్నివేశాల్లో వీటిలో కొత్త వైష్ణవ్ కనిపిస్తాడు.అంతేకాదు తెర మీద చాలా స్టైలిష్ గా కనిపించాడు.హీరోయిన్ విషయానికి వస్తే శ్రీ లీల గ్లామర్ గా కనిపిస్తూ ఎనర్జీ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది.విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు జోజు జార్జ్ నటన కూడా బాగుంది. ,మిగితా పాత్రల్లో నటించిన రాధికా శరత్ కుమార్,అపర్ణ దాస్,సుమన్, జయప్రకాష్ వారి పాత్రల్లో మెప్పించారు.

టెక్నికల్ గా చూస్తే దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రొటీన్ కథతో ఓ మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ ను అందించాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాలో హైలైట్ అయ్యింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరోయిజం ను ఎలివేట్ చేసింది.డడ్లీ సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ క్యాలిటీ గా వున్నాయి.ఎడిటింగ్ ఓకే నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.

ఓవరాల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చిన ఈ ఆదికేశవ టైం పాస్ చేయిస్తాడు.హీరో హీరోయిన్ల యాక్టింగ్, డ్యాన్స్ ,సంగీతం,క్లైమ్యాక్స్ హైలైట్ అయ్యాయి.పెద్దగా అంచనాలు లేకుండా వెళితే రెండు గంటలు ఆదికేశవ ఎంటర్ టైన్ చేస్తాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =