బిగ్ బాస్ 7 ప్రస్తుతం 11వ వారం కూడా పూర్తి కావస్తుంది. ఇక ఈవారం ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ టాస్కుల్లో యావర్ వరుసగా అర్జున్, ప్రశాంత్, శోభా, శివాజీ, ప్రియాంక లతో పోటీ పడ్డాడు. ఇక మొన్న శివాజీ, ప్రియాంక, యావర్ లకు ఒక టాస్క్ ఇవ్వగా.. ఈ టాస్క్ లో మొదట ప్రియాంక బాల్స్ పడిపోయాయి. ఆతరువాత శివాజీ బాల్స్ పడిపోగా ఫైనల్ గా యావర్ నిలుస్తాడు. ఇక ఈ టాస్క్ కు సంచాలకులుగా ఉన్న ప్రశాంత్, శోభా చర్చించుకుంటారు. ఇక చాలా చర్చల అనంతరం యావర్ ను విజేతగా ప్రకటిస్తారు. దీంతో ఫైనల్ గా యావర్ ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ తరువాత ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ను పెడతాడు బిగ్ బాస్. రెండు లెవల్స్ లో గేమ్ జరుగుతుందని చెప్పాడు. హౌస్ మేట్స్ అందరికీ ఈ టాస్క్ పెట్టాడు. దీనిలో భాగంగానే ముందు ఇటుకల టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ప్రతి రౌండ్ లో ఎవరు తక్కువ ఇటుకలు తెస్తారో వారు గేమ్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. అలా ఫస్ట్ రౌండ్ లోనే రతిక, గౌతమ్, అశ్విని, శోభా శెట్టి, శివాజీ వరుసగా గేమ్ నుండి అవుట్ అయ్యారు. చివరిగా మిగిలిన ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అమర్ దీప్ ను సెకండ్ లెవల్ కు ఎంపిక చేస్తాడు.
ఆ నలుగురికి మరో టాస్క్ ఇచ్చాడు. ఇటుకలతో టవర్ కొట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. టవర్ కట్టడం అయిపోయిన తరువాత మిగిలిన కంటెస్టెంట్ లు టవర్ ను బాల్స్ తో కొట్టాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరి టవర్ తక్కువగా ఉంటే ఆకంటెస్టెంట్ గేమ్ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈగేమ్ లో ముందు ప్రశాంత్, ఆ తరువాత అర్జున్ గేమ్ నుండి ఔట్ అయ్యారు. చివరిగా ప్రియాంక, అమర్ టవర్ లను కూల్చే ప్రయత్నం చేయగా.. ఈ క్రమంలో అమర్ చాలా ఎమోషనల్ అవుతాడు. అరుస్తూ, ఏడుస్తూ హౌస్ మేట్స్ ను బ్రతిమాలుకుంటాడు. ఫైనల్ గా ప్రియాంక ఈ టాస్క్ లో గెలిచి ఈవారం కెప్టెన్ అవుతుంది.
మరి వీకెండ్ వచ్చేసింది.. ఈవారం ఎవరు ఇంటినుండి బయటకు వెళతారు.. ఎవరికి నాగ్ చేతిలో క్లాస్ లు పడతాయి.. ఎవరికి ప్రశంసలు దక్కుతాయి అన్నది చూడాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయట్ చేయాల్సిందే..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: