గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్

Guntur Kaaram First Single Dum Masala full song out now

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాట అయితే ఆకట్టుకుంటుంది. సంజిత్ హెగ్డే పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ఈసినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా.. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =