జూ. ఎన్టీఆర్ హీరోయిన్ బాలయ్యపై కామెంట్స్, నెట్టింట వైరల్

Jr NTR Heroine Payal Ghosh Interesting Comments on Nandamuri Balakrishna

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ‘భగవంత్ కేసరి’ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. వరుసగా మూడు రూ. 100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించారు. దీంతో ఆయనపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో పాయల్ ఘోష్.. “బాలకృష్ణ సర్ ఈ వయస్సులో కూడా సూపర్ హిట్స్ ఇస్తున్నారు.. బాలీవుడ్ నటులు ఆయనను చూసి నేర్చుకోవాలి” అని పేర్కొన్నారు. కాగా బాలకృష్ణపై పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పాయల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంతకుముందు కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఇండస్ట్రీలో తనకెదురైన అవమానాలపై ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారాన్నే రేపాయి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో కూడా జూ. ఎన్టీఆర్ పై ఇలాగే స్పందించారు. ఆయన ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడని కితాబిచ్చారు. తారక్ నటన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని.. పదేళ్ల క్రితమే తాను ఈ మాట చెప్పానని, అయితే అప్పుడు ఎవరూ తనని నమ్మలేదని వాపోయారు. కాగా పాయల్ జూనియర్ తో ‘ఊసరవెల్లి’ సినిమాలో కలిసి నటించారు. అందులో హీరోయిన్ తమన్నా స్నేహితురాలి పాత్రలో పాయల్ కనిపించారు. కాగా ఒక హిందీ హీరోయిన్ ఇలా తెలుగు హీరోలను.. అది కూడా అప్పుడు అబ్బాయిని, ఇప్పుడు బాబాయిని ప్రశంసిస్తూ మాట్లాడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తుండగా.. బాలకృష్ణ, బాబీ డైరెక్షన్ లో ‘NBK 109’లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =