చిన్న సినిమాగా వచ్చిన మాఊరి పొలిమేర 2 బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా చోట్ల ఫస్ట్,సెకండ్ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.దాంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.మొదటి రోజు ఈసినిమా 3కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 1.50కోట్లు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో రేపటి కల్లా బ్రేక్ ఈవెన్ కానుంది.ముఖ్యంగా మౌత్ టాక్ బాగుండడంతో ఈరెండు రోజులు,మొదటి రోజుకన్నా ఎక్కువ వసూళ్లను దక్కించుకోనుంది.రేపటి కల్లా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఇప్పట్లో ఎలాగూ పెద్ద సినిమాల విడుదలకూడా లేకపోవడం పొలిమేర 2కు కలిసి రానుంది.ఇదే జోరు కొనసాగిస్తే ఫుల్ రన్ లో ఈసినిమా 15కోట్లకు పైగా రాబట్టే ఛాన్స్ వుంది.
2021లో ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పొలిమేరకు సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.ఇక పొలిమేర 2కూడా హిట్ కావడంతో పొలిమేర 3కూడా రానుంది.హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన పొలిమేర 2లో సత్యం రాజేష్, జబర్దస్త్ శ్రీను, కామాక్షి భాస్కర్ల ,బాలాదిత్య కీలక పాత్రల్లో నటించారు.అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు జ్ఞానీ సంగీతం అందించగా గౌర్ కృష్ణ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























