ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీ గా వున్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల.పెళ్లి సందడితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ అక్కడి నుండి వెనుదిరిగిచూసుకోలేదు.ప్రస్తుతం చేతిలో 5సినిమాలు వున్నాయి.ఆల్రెడీ ఈనెలలో భగవంత్ కేసరి తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్యకు కూతురిగా నటించింది.ఇక రానున్న మూడు నెలల్లో శ్రీలీల నెలకో సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా నవంబర్ లో ఆదికేశవతో రానుంది.వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా శ్రీ లీల హీరోయిన్ .పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.నిజానికి ఈనెల 10న ఈసినిమా థియేటర్లలోకి రావాల్సి వుంది.కానీ వరల్డ్ కప్ ఫీవర్ వల్ల రెవెన్యూ లాస్ అవ్వడం ఎందుకని విడుదలను నవంబర్ 24కు మార్చారు.
ఇక డిసెంబర్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో రానుంది.నితిన్ హీరో గా నటిస్తుండగా సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ గా కనిపించనున్నాడు.ఈసినిమా మీద కూడా మంచి అంచనాలు వున్నాయి.డిసెంబర్ 8న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.వక్కంతం వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
అలాగే వచ్చే ఏడాది జనవరి లో గుంటూరు కారంతో రానుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న ఈసినిమాలో శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.సంక్రాంతికి విడుదలకానుంది.ఈసినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.
మరి ఈమూడు సినిమాలు శ్రీ లీలకు హీరోయిన్ గా హ్యాట్రిక్ విజయాలను అందిస్తాయో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: