గత నెలలో విడుదలైన రెండు మేజర్ సినిమాలు తాజాగా ఓటిటిల్లో కూడా రిలీజ్ అయ్యాయి.అందులో తెలుగు సినిమా స్కంద ఒకటి కాగా రెండోది బాలీవుడ్ మూవీ జవాన్.గత నెల 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది జవాన్.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈసినిమాతో షారుఖ్ వరుసగా రెండో విజయాన్ని సాధించడమే కాదు వరసగా 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షారుక్ బర్త్ డే సందర్బంగా జవాన్ ను ఈరోజునుండి నెట్ ఫ్లిక్స్ హిందీ తోపాటు తెలుగు,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.థియేటర్ వెర్షన్ కాకుండా ఎక్స్టెండెడ్ వెర్షన్ తో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఈసినిమా కేవలం హిందీలోనే కాదు సౌత్ లోకూడా సాలిడ్ వసూళ్లను దక్కించుకుంది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార,దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఇక తెలుగు సినిమా స్కంద కూడా ఈరోజునుండి ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చింది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా గత నెల 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. రామ్ నటన,బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,హీరో హీరోయిన్ల డ్యాన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: