టాలీవుడ్‌లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ దసరా పండుగ సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించింది. దసరా విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూడో సినిమాగా, అది కూడా హ్యాట్రిక్ మూవీగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే..? ఇప్పటివరకు ఆయన తీసిన 4 సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. ఇంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’, ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. తద్వారా అనిల్ రావిపూడి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సరసన నిలిచారు. కాగా తెలుగు దర్శకులలో ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించింది వీరిద్దరే కావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి తొలిసారిగా ఈ రికార్డ్ అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా తొలి రూ. 100 కోట్ల మూవీగా నిలిచింది. భారతీయ చిత్రపరిశ్రమలో అప్పటివరకూ ఎవరూ చేయనివిధంగా ప్రయోగాత్మకంగా ‘ఈగ’ను ప్రధానపాత్రలో ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీసి సంచలన విజయం అందుకున్నారు. అనంతరం స్టార్ హీరో ప్రభాస్‌తో ‘బాహుబలి – 1’, ‘బాహుబలి – 2’ సినిమాలతో వరుసగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నారు. ఆ తరువాత గతేడాది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేశారు. ఈ క్రమంలో ‘బాహుబలి – 2’ మరియు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ఏకంగా రూ. 1000 కోట్లకు పైబడి కలెక్షన్స్ సాధించడం విశేషం. దీంతో దేశంలో మరే ఇతర దర్శకుడికీ అందనంత ఎత్తులో నిలిచారు రాజమౌళి.
ఇక ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాతో రాజమౌళి ఖ్యాతి దేశం ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశం ఖ్యాతిని కూడా ఆస్కార్ వేదికపై ఘనంగా చాటారు. ఇక ఇదిలా ఉండగా.. రాజమౌళి తన తర్వాతి సినిమాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో ట్రెజర్ హంట్ కథాంశంగా ఇది ఉండనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే ఆయన తన తరువాతి సినిమాను కూడా స్టార్ హీరోతో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: