శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వచ్చిన సినిమా పెదకాపు1. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు రూట్ మార్చి ఈసినిమాతో ఫుల్ యాక్షన్ కమ్ ఫ్యాక్షన్ కథతో వచ్చాడు. ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అయింది. ఆదిపత్యపోరు నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోగా నటించిన విరాట్ కర్ణ నటన, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాా ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే నేటి నుండి ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటరల్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కాగా ఈసినిమాలో ఇంకా రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ ఈసినిమాకు సంగీతం అందించగా..ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































