పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 ఏడీ . ఈసినిమాను ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే అంతర్జాతీయ లెవల్ లో గుర్తింపును తెచ్చుకుంటుంది. దీనితోపాటు సందీప్ వంగాతో ఒక సినిమా అలానే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లోనే ప్రభాస్ కెరీర్ లో నే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచే ఛత్రపతి సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తల్లి సెంటిమెంట్ ను ఈసినిమాలో చూపించాడు రాజమౌళి. ఇక ఈసినిమా ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఇక ఈసినిమా ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన ఈసినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 4కే వెర్షన్ లో ఈసినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతుంది.
కాగా ఈసినిమాాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా.. భానుప్రియ, కోటా శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, జయ ప్రకాష్ రెడ్డి, శీనివాస్ రెడ్డి, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: