భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్

funny video released from bhagavanth kesari movie

అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత నటసింహం బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తుండటం.. అందులోనూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వరుస అప్ డేట్లతో సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. అంతేకాదు టైటిల్ సాంగ్ తో ఆ అంచనాలను మరింత పెంచేశారు. ఇదిలా ఉండగా.. ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ ఆన్ సెట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలోషూటింగ్ లో, సెట్ లో ఎంత ఫన్ గా ఉంటుందో చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twelve =