టాలీవుడ్ కమెడియన్లలో ‘వెన్నెల’ కిశోర్ శైలే వేరు. సినిమాల్లో కథానాయకుడి పాత్రధారి పైనా సెటైర్స్ వేయగల స్థాయి ఉన్న నటుడు. అమాయకత్వం, వ్యంగ్యం కలగలిసిన వినోదానికి ఆయన కేరాఫ్ అడ్రస్. ‘వెన్నెల’ కిశోర్ తన డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు. గమనిస్తే.. గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వెన్నెల కిశోర్ కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాదు, తనకు సరిపోయే క్యారెక్టర్లు వచ్చినప్పుడు కథానాయకుడిగానూ చేస్తుంటారు. ఈ క్రమంలో వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘చారి 111’ మూవీకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసున్న ఒక వీడియోను షేర్ చేశారు. కాగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తోంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
గత కొన్ని రోజుల క్రితం సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక విడుదలైన టీజర్‌లో.. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అయితే అసలు, ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ ప్రేక్షకులకు మరోసారి ఫుల్‌గా వినోదం అందించనున్నారని అర్ధమవుతోంది. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.
కాగా ఈ సినిమాలో.. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. కరుణాకర్ స్టంట్స్ రూపొందించారు. ఇక అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైన్ చేయగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్య సహకారం అందించారు. అలాగే సినిమాటోగ్రాఫర్ గా కషిష్ గ్రోవర్.. సంగీత దర్శకుడిగా సైమన్ కె కింగ్ పనిచేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: