బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ సంచలనం.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Mad Movie Box Office Collection: The Fun Ryder Grabs Gross Over 8.4 Cr in 3 Days

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవగా.. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శుక్రవారం (అక్టోబర్ 06, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అంచనాలకు మించి హిట్ అనిపించుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సెంట్ పెర్సెంట్ సక్సెస్ అయింది. దీంతో ప్రతి షోకి వసూళ్ళను పెంచుకుంటూ పోతోంది. కంప్లీట్ కమర్షియల్ పంథాలో తెరకెక్కిన ఈ సినిమా పక్కా పైసా వసూల్ మూవీ అనిపించుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘మ్యాడ్’ మూవీ తొలిరోజు 1.8 కోట్ల గ్రాస్ సాధించగా.. మూడోరోజుకి మొత్తం రూ.8.4 కోట్లు రాబట్టింది. అలాగే యూఎస్ఏలో 200K (రూ. 1,66,45,000) గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పోటీగా బరిలో మరే చిత్రం లేకపోవడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు దసరా పండుగ వరకు సరైన సినిమా ఏదీ లేకపోవడం కూడా ‘మ్యాడ్’ సినిమాకి బాగా కలిసొస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఈ వారాంతానికి నిర్మాతకు కళ్ళు చెదిరే లాభాలను అందించనుంది.

ఇక ఈ చిత్రంలో నటించిన వారిలో ఒకరిద్దరు మినహాయిస్తే.. నటీనటులందరూ కొత్తవారే కావడం గమనార్హం. అయినా కంటెంట్ బావుండటంతో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కాగా చిత్రం విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘జాతిరత్నాలు’ కన్నా ఎక్కువే నవ్విస్తుంది అని, లేదంటే డబ్బులు వాపస్ చేస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేశారంటే.. మొదట అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సినిమా చూసినవారందరూ ఇది నిజమే అనేలా ఈ మధ్యకాలంలో వచ్చిన ఫుల్ ఎంటర్‌టైనర్ ఇదే అని కితాబిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.