చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామాయణం క్విజ్

Quiz on ramayanam under the leadership of chinna jeeyar swamy

ఆద్యాత్మికత, జ్ఞానం ఇంకా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేస్తూ మెరుగైన సమాజాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ అద్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి గారు. ఇక ఇప్పటివరకూ ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆన్ లైన్ రామయణం క్విజ్ కాంటెస్ట్. రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు. అలాంటి రామాయణం గురించి అన్ని వయసుల వారికి తెలియచేయాలన్న నేపథ్యంలోనే ఈ క్విజ్ ను నిర్వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేటి తరాలకు ఇతిహాసాలు, సంస్కృతుల గురించి తెలియచేసేందుకు ఈ క్విజ్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఈ క్విజ్ ను ఇక్కడ మాత్రమే కాదు గ్లోబల్ వైజ్ గా నిర్వహించి అందరికీ అవకాశం కల్పించడంతో పాటు అవగాహన కూడా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ రామాయణ క్విజ్ కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ సరిహద్దుల్ని చెరిపేసి వరల్డ్ వైడ్ గా ఎంతో గుర్తింపును సొంతం చేసుకుంది. భాష మరియు సాంస్కృతిక సరిహద్దుల్ని అధిగమించడానికి అలానే వివిధ నేపథ్యంగలవారికి ఈ రామాయణ బోధలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమం క్విజ్ లో పాల్గొనేవారిలో ఐక్యతా భావాన్ని మరియు భాగస్వామ్య వారసత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

ఈనేపథ్యంలోనే సమతామూర్తి రెండో వార్షికోత్సవం సమతా కుంభ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనుండగా.. అంతర్జాతీయ స్థాయిలో ఈ క్విజ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ క్విజ్ లో రామాయణంలోని పాత్రలు, కథలు మరియు నైతిక బోధనలతో సహా వివిధ అంశాలను కవర్ చేస్తుంది. ఈ క్విజ్‌లో విజేతలకు 9 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేయనున్నారు.

దీనిలో భాగంగానే ఈ క్విజ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, రిజిస్టర్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటు చేశారు.

https://ramayanacontest.org/
పైన వెబ్ సైట్ ద్వారా ఈ క్విజ్ లో పాల్గొనడానికి ఎన్ రోల్ అవ్వాల్సిఉంటుంది. ఎన్ రోల్ ఫీజు 100 రూపాయలు.

ఒకసారి ఎన్ రోల్ అయిన తరువాత రిఫరెన్స్ మెటీరియల్ ఆన్ లైన్ ద్వారా ఇవ్వబడుతుంది.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో కూడా ఈక్విజ్ ఉంటుంది
ప్రతిరోజూ 10 శాంపిల్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి

సెలక్షన్ రౌండ్స్
ఇక ఈ క్విజ్ లో మూడు రౌండ్లను నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రౌండ్లు ఆన్ లైన్ లో, మూడో రౌండ్ ఆఫ్ లైన్ లో నిర్వహిస్తున్నారు.
మొదటి రౌండ్ నవంబర్ లో ఉంటుంది
రెండో రౌండ్ జనవరిలో ఉంటుంది
ఫైనల్ గా మూడవ రౌండ్ 2024, ఫిబ్రవరి 24 వ తేదీన స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ వద్ద నిర్వహించబడుతుంది.

విన్నింగ్ ప్రైజెస్
ఈ క్విజ్ లో పాల్గొనేవారిని మూడు కేటగిరిల్లో తీసుకోనున్నారు. బిగినర్స్ కేటగిరీలో 5నుండి 15 సంవత్సరాలలోపు వారు, ఇంటర్ మీడియట్ కేటగిరీలో 16 నుండి 35 సంవత్సరాలలోపు వారు అలానే 35 సంవత్సరాలు పైబడిన వారిని ఎక్పర్ట్ కేటగిరీగా తీసుకోనున్నారు.

ప్రతి గ్రూపు నుండి 29 మంది విజేతలను తీసుకోనున్నారు. అలా మొత్తం 87 మంది విజేతలను తీసుకోనున్నారు. ప్రతి గ్రూప్ నుండి ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష, సెకండ్ ప్రైజ్ 75వేలు, థర్డ్ ప్రైజ్ 50 వేలు మరియు నాలుగో ప్రైజ్ 25 వేలు ఇవ్వనున్నారు. అలానే ఎంకరేజ్ మెంట్ కింద 25 మందికి 2వేల చొప్పన ఇవ్వనున్నారు.

షరతులు
ప్రపంచవ్యాప్తంగా ఈ క్విజ్ జరుగుతుంది
పోటీ దారులు పాల్గొనేవారు అవసరమైన సరైన వివరాలను అందించాలి. లేదంటే ఎటువంటి బహుమతులు అందుకోలేరు.
ఏ సమయంలోనైనా పోటీని సవరించడానికి లేదా నిలిపివేయడానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి.
పోటీదారుల చర్యలు క్విజ్‌కు హానికరంగా ఉంటే వారిని అనర్హులుగా చేయడానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి.
పోటీలో పాల్గొనేవారు నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలి

సంప్రదించవలసిన నెంబర్స్..
ఏదైనా వివరాలు, ఇతర సమాచారం తెలుసుకోవాలంటే సంప్రదించవలసిన నెంబర్ లేదా వెబ్ సైట్..
7901422022
[email protected]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nine =