భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్‌ రిలీజ్

Bhagavanth Kesari Team Released Uyyaalo Uyyaala Full Lyrical Video Song

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన మూవీ టీజర్ దుమ్ము రేపింది. ఇందులో ‘నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏళ్ళు యాదుంటాది’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ‘జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి’ స్పెషల్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశ్ యాంథమ్ పాటను విడుదల చేయగా.. అది నెట్టింట బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాయంత్రం ‘ఉయ్యాలో ఉయ్యాలా’ అనే పాటను రిలీజ్ చేసింది టీమ్.

‘ఉయ్యాలో ఉయ్యాలా’ లిరికల్ సాంగ్‌ ఎలా ఉందంటే..?

ఇక ఈ పాట భగవంత్ కేసరికి, ఆయన కూతురికి గల బంధాన్ని తెలిపేలా ఉంది. సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కూతురిగా కనిపించనున్నట్లు సమాచారం. కాగా తొలుత బాలకృష్ణ పక్కన ఒక చిన్న పాపను చూపించడంతో ఈ పాట మొదలయింది. క్రమంగా ఆ పాప పెరిగి పెద్దదై పాప స్థానంలో శ్రీలీల కనిపిస్తుంది. అయితే ఈ పాట వినడానికి ఎంతో హృద్యంగా ఉంది. ఈ పాటను గీత రచయిత అనంత శ్రీరామ్ రాయగా ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఆలపించారు. మరో విశేషమేంటంటే..? ఈ వీడియోలో సాంగ్ మేకింగ్ సీన్స్ కూడా చూపించారు. అందులో శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడితో హీరో నందమూరి బాలకృష్ణ జోక్స్ వేస్తూ వారిని నవ్విస్తూ కనిపించారు. అలాగే ఒక సన్నివేశంలో ఆయన శ్రీలీలకు సజెషన్స్ ఇవ్వడం కూడా గమనించొచ్చు. సో.. మొత్తానికి ఉయ్యాలో ఉయ్యాలా సినిమాలో సెంటిమెంట్ పాటగా ఉండనున్నట్లు అర్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా చూపిస్తానంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. దీనికి తగ్గట్లే ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పుట్టిస్తున్నారు. చాలా కాలం తర్వాత బాలకృష్ణ తెలంగాణ నేపథ్యం కలిగిన సినిమాలో నటిస్తుండటం గమనార్హం. ఇంతకుముందు ఆయన ‘వేములవాడ భీమకవి’, ‘నిప్పు రవ్వ’ సినిమాలు చేశారు. ఈ క్రమంలో ‘భగవంత్ కేసరి’లో తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమా కోసం 12 భారీ సెట్స్ వేసినట్లు, 24 లోకేషన్స్‌లో షూటింగ్ చేసినట్లు టీమ్ పేర్కోంది. కాగా ఇప్పటికే ఈ యేడాది సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =