రివ్యూ :పెదకాపు -1

peddha kapu 1 telugu review

నటీనటులు :విరాట్ కర్ణ,ప్రగతి శ్రీవాత్సవ్,రావు రమేష్,శ్రీకాంత్ అడ్డాల,అనసూయ భరద్వాజ్
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ :చోటా కె నాయుడు
దర్శకత్వం :శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నారప్పతో గేర్ మార్చుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.అప్పటివరకు క్లీన్ ఫ్యామిలీ &లవ్ ఎంటెర్టైనెర్ లను తీసిన ఈ డైరెక్టర్ నారప్పతో రూరల్ మాస్ మూవీని తీసి షాక్ ఇచ్చాడు.ఇక ఈసినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన సినిమా పెదకాపు -1.ఈసినిమాను కూడా రూరల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రస్టిక్ గా తెరకెక్కించాడు. విడుదలకు ముందు ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.ఈసినిమా కోసం కొత్త కుర్రాడు విరాట్ కర్ణ ను హీరోగా తీసుకున్నాడు.మరి ఈ హీరో ఎలా చేశాడు? ఇంతకీ పెదకాపు కథేంటి? ఎలావుందో చూద్దాం.

కథ :

పెదకాపు (విరాట్ కర్ణ) అణగారిన వర్గానికి చెందినవాడు.గోదావరి తీర ప్రాంతంలో వున్న లంక గ్రామంలో నివాసం ఉంటాడు.అయితే అక్కడ స్థానికంగా వున్న ఇద్దరు బలయమైన నాయకులు సత్య రంగయ్య (రావు రమేష్),బయ్యన్న వల్ల అక్కడి ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయి.ఈక్రమంలో పెదకాపు కులవివక్ష కు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టి అణగారిన వర్గాలకు ఏకైక ఆశాకిరణంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏవిధంగా ఎదిగాడు అనేదే మిగితా కథ.

విశ్లేషణ :పెదకాపు రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామా.1980లో అప్పటి రాజకీయ నాయకుల చేతిలో కుల వివక్ష ఎలా ఎదురుకున్నారు దానికి పెదకాపు ఎదురెళ్లి ఎలా పోరాటం చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్.సినిమా అంతా దాదాపు సీరియస్ మోడ్ లోనే సాగుతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తను చెప్పాలనుకుంది చెప్పాడు డైరెక్టర్ .

హీరో ఇంట్రో సీన్ దగ్గరనుండి శ్రీకాంత్ అడ్డాల డ్యూటీ చేశాడు.సినిమాలో ప్రీ ఇంటర్వెల్ ,ఇంటర్వల్ సీన్స్ అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్స్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది.అలాగే మెచ్చుతగ్గుదవిషయం ఏంటంటే ఎవరి మనో భావాలను దెబ్బతీయకుండా సినిమా డీల్ చేసిన విధానం బాగుంది.శ్రీకాంత్ అడ్డాల రాసిన డైలాగ్స్ ఆలోచింపచేసేలా వున్నాయి.

నటీనటులు విషయానికి వస్తే హీరోగా నటించిన విరాట్ కర్ణకు ఇదే మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ విషయాన్ని గుర్తుచేయకుండా ఎంతో అనుభవం వున్న నటుడిలాగా నటించాడు.ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ప్రతిభ చూపించాడు.అలాగే హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ్ కూడా ఇదే మొదటి సినిమా.తను కూడా బాగానే చేసింది.ఇక శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో రావు రమేష్ కు పవర్ ఫుల్ పాత్రలు పడుతుంటాయి. ఈసినిమాలోకూడా అలాంటి పాత్రే  దొరికింది.ఆపాత్రలో రావు రమేష్ చెలరేగిపోయాడు.శ్రీకాంత్ అడ్డాల కూడా ఈసినిమాలో నటించాడు.విలన్ గా కనిపించి మెప్పించాడు వీరితోపాటు అనసూయ భరద్వాజ్ కు కూడా చాలా మంచి పాత్ర దొరికింది.ఈపాత్రలో తన నటన ఆకట్టుకుంది.

టెక్నికల్ విషయానికి వస్తే చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది.కొన్ని షాట్స్ ఫ్రేమ్స్ అయితే వావ్ అనిపించేలావున్నాయి.అలాగే మిక్కీ జె మేయర్ సంగీతం కూడా సినిమాకు చాలా ప్లస్. ముఖ్యంగా బీజీఎమ్ అవుట్ స్టాడింగ్.ఎప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ అందించే మిక్కీ ఈసినిమాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలో అదే ఇచ్చాడు.ఎడిటింగ్ లో మార్తాండ్ కె వెంకటేష్ తన అనుభవాన్ని చూపించాడు.క్వాలిటీ విషయంలో నిర్మాత రవీందర్ రెడ్డి ఎక్కడా రాజీపడలేదు.

ఓవరాల్ గా హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా వచ్చిన పెదకాపు-1లో హీరో నటన,సపోర్టింగ్ క్యాస్ట్,ఇంటర్వెల్,క్లైమ్యాక్స్ ,బీజీఎమ్ ,సినిమాటోగ్రఫీ హైలైట్ అయ్యాయి.ఓ మంచి రూరల్ పొలిటికల్ డ్రామాను చూడాలనుకుంటే పెదకాపును చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 20 =