టాలీవుడ్ నేటి జెనరేషన్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన, సినిమా ఫలితం ఎలా ఉన్నా తను మంచి నటుడు అని అనిపించుకున్నారు. ఈ క్రమంలో ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా చేస్తోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీని ప్రకారం.. ‘రూల్స్ రంజన్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాలోని ఒక్క సన్నివేశం కూడా కట్ కి గురికాలేదని చిత్ర బృందం తెలిపింది. కాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే సినిమా టోటల్ రన్ టైం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కాగా ‘రూల్స్ రంజన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక లవ్, రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’, ‘దేఖో ముంబై’ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. అలాగే కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే వాస్తవానికి ఈ సినిమా ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా.. మేకర్స్ దీనిని పోస్ట్ పోన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఇప్పటికే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మరియు ‘మీటర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: