కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈఏడాది వరుసగా రెండు సార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు.ఈఏడాది జనవరిలో పఠాన్ తో తొలిసారి ఈ ఫీట్ సాధించగా ఈనెలలో జవాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు.ఈసినిమా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా 1043.21కోట్ల గ్రాస్ ను వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ వ్యాప్తంగా ఈసినిమా 584.32 నెట్ వసూళ్లతో హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.ఈక్రమంలో జవాన్..గదర్ 2,పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసి మొదటి స్థానానికి చేరుకుంది.అయితే 6ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఏ హిందీ సినిమాకూడా ఆల్ ఇండియా కలెక్షన్స్ విషయంలో బాహుబలి 2ను మాత్రం దాటలేకపోయాయి.
ఇక జవాన్ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఇప్పటికి డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.వచ్చే నెల చివర్లో ఈసినిమా ఓటిటి లోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది.తమిళ దర్శకుడు అట్లీ ఈసినిమాను డైరెక్ట్ చేయగా దీపికా పదుకోన్,నయనతార కథానాయికలుగా నటించారు. షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: