బాలీవుడ్ లో షారుక్ ఖాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.షారుక్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న తన ఫ్యాన్ బేస్ మాత్రం చెక్కు చెదరలేదు.రీసెంట్ గా వచ్చిన పఠాన్,జవాన్ సినిమాలే అందుకు నిదర్శనం.ఈసినిమాలు 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.ఇక బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. సాహో,ఆదిపురుష్ అక్కడ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తలపడాల్సి వస్తే ఎలా ఉంటుంది.సరిగ్గా ఇప్పుడు అదే జరుగనుంది.షారుక్ ఖాన్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో డంకిలో నటిస్తున్నాడు.షారుక్ కి తోడు స్టార్ డైరెక్టర్ కావడంతో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.ఈసినిమా డిసెంబర్ 22న విడుదలకానుంది.ఇది ఈఏడాది షారుక్ కు మూడో రిలీజ్ కానుంది.
ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే ఈసినిమా నిన్ననే విడుదలకావాలి కానీ సమయానికి వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు.దాంతో నవంబర్ లో విడుదలవుతుందేమో అనుకున్నారు కానీ ఇంకాస్త టైం తీసుకొని డిసెంబర్ 22న దింపుతున్నారు.ఈరోజే ఈరిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.సో డంకితో సలార్ క్లాష్ కన్ఫార్మ్ అయినట్లే.మరి ఒకే రోజు వస్తున్న ఈరెండు సినిమాలకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: