బిగ్ బాస్ 7- ఫుల్ ఫైర్ తో 4వ వారం నామినేషన్ ప్రక్రియ

bigg boss telugu season 7 4th week nominations on fire

బిగ్ బాస్ 7 లో మూడు వారాలు పూర్తయిపోయి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈసారి వీకెండ్స్ కూడా చాలా వేడి వేడిగా ఉండబోతున్నట్టు కనిపిస్తున్నాయి. సండే ఫండే కాకుండా మండే ఎపిసోడ్ లా డిజైన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే సండే ఎపిసోడ్ లో ఒకరి మీది ఒకరి అభిప్రాయాలు తెలియచేయగా ఆ వేడితోనే సండే ఎపిసోడ్ కూడా మొదలైపోయింది. ఎపిసోడ్ లో భాగంగా రతిక, ప్రశాంత్ గురించి నాగార్జున అడిగినప్పుడు శివాజీ రెండు చేతులు కలిస్తేనే ఏదైనా అవుతుంది అని చెప్పడంతో దాని గురించి శివాజీతో డిస్కషన్ పెడుతుంది రతిక. ఇద్దరూ కాసేపు వాదించుకున్న తర్వాత శివాజీ సారి చెప్పాను ఇంకా కాళ్లు పట్టుకోవాలా.. కావాలనే ల్యాగ్ చేస్తున్నావనిపిస్తుంది అని అసహనం వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత ఇదే విషయంపై మాట్లాడుతూ ఆయన్ని మనిషేనా?ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రేక్షకులు మండే అంటే వెయిట్ చేసేది నామినేషన్స్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నట్టే నామినేషన్ ప్రిక్రియ వచ్చేసింది. ఇక నామినేషన్స్ ప్రిక్రియలో కూడా బిగ్ బాస్ తన క్రియేటివిటీని చూపిస్తున్నాడు. కంటెస్టెంట్లు సిల్లీ రిజన్స్ చెప్పడానికి వీలులేకుండా చేస్తున్నాడు. ఈవారం నామినేషన్ ప్రక్రియను కూడా అలానే డిజైన్ చేశాడు. ఇంటి సభ్యులుగా ఎంపికైన సందీప్, శివాజీ, సందీప్ లను జ్యూరీ సభ్యులుగా పెట్టి.. నామినేట్ చేయాలనుకునే వారు ఇద్దరు వ్యక్తులను ఎంచుకొని వారిని బోనులలో పెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. జ్యూరీ సభ్యులు ఎవరి నామినేషన్ ను ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటారో ఆ కంటెస్టెంట్ ను గిల్ట్ బోర్డ్ పై పెట్టాలి. గిల్ట్ బోర్డ్ పై పెట్టిన వ్యక్తిని మళ్లీ నామినేట్ చేయడానికి వీల్లేదు అనే కండీషన్ కూడా పెట్టాడు.

ఈ ప్రక్రియలో మొదటగా వచ్చిన ప్రిన్స్ యావర్ ప్రియాంకను అలానే తేజను నామినేట్ చేశాడు. పవరాస్త్ర టాస్క్ నుండి తనను తొలగించినందుకు ప్రియాంకను నామినేట్ చేస్తే.. టాస్క్ లు ఆడట్లేదని, ఎంటర్ టైన్ మెంట్ ఓవర్ అయిపోతుందని తేజను నామినేట్ చేశాడు. వీరిద్దరిలో ప్రియాంకను ఎంపిక చేస్తారు జ్యూరీ సభ్యూలు. దీంతో ప్రియాంక పేరు గిల్ట్ బోర్డులోకి ఎక్కుతుంది.

ఆ తరువాత వచ్చిన శుభశ్రీ, అమర్ దీప్ లను నామినేట్ చేసింది. రతికను నామినేట్ చేస్తూ బయట సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు..రతిక తన ఎక్స్ గురించి పదే పదే మాట్లాడుతుందని.. అలానే వేరే వాళ్లకు ఇన్ఫ్లూయన్స్ అయి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చెబుతుంది. దీంతో రతిక, శుభశ్రీ ఇద్దరూ కాసేపు అరుచుకుంటారు. నేను ఎవరికో చెప్పింది విని ఇప్పుడు మాట్లాడుతున్నావు.. నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అంటూ రతిక అనగా.. మైండ్ యు వర్ లాంగ్వేజ్ అంటూ శుభశ్రీ వార్నింగ్ ఇస్తుంది. కంటెండర్ గా గుండు గీయించుకోవడానికి వెనుకాడావని.. ఫ్రెండ్స్ కోసం ఆడుతున్నావు.. ఎమోషనల్ గా వీక్ అవుతున్నావని చెప్పగా దానికి అమర్ దీప్ తనను డిఫెంట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. రతిక-అమర్ దీప్ లలో జ్యూరీ సభ్యులు రతికను నామినేట్ చేస్తారు. దీంతో రతిక గిల్ట్ బోర్డ్ ఎక్కుతుంది.

అనంతరం గౌతమ్ వచ్చి ప్రిన్స్ ను అలానే తేజను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ప్రిన్స్, గౌతమ్ మళ్లీ గొడవకు దిగారు. గౌతమ్ వచ్చి ప్రిన్స్ కు నీ యారొగెన్సీ వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం అంటూ.. గేమ్ ఛేంజర్ వచ్చేసరికి ఆడియన్స్ అందరూ నావైపే ఉన్నారని అంటున్నావు మేము కూడా సేవ్ అయ్యాము.. మావైపున ఉన్నారు అంటూ మొదలుపెట్టాడు. ఇక గౌతమ్ మొదలుపెట్టిన వెంటనే ప్రిన్స్ కూడా మళ్లీ ఆ మ్యాటర్ ఎందుకు తీస్తున్నావు అంటూ వెక్కిరిస్తూ బోనులో నుండి బయటకు వచ్చి గౌతమ్ మీద మీదకు వస్తూ మాట్లాడుతుంటాడు.. దీంతో జ్యూరీ సభ్యులు కలుగచేసుకొని ప్రిన్స్ ను తన ప్లేస్ లోకి వెళ్లాలని కోప్పడతారు. దీంతో గౌతమ్ పాయింట్లు సిల్లీ పాయింట్స్ అని కాకపోతే ప్రిన్స్ బిహేవియర్ గురించి తనను నామినేట్ చేస్తున్నామని తెలుపుతారు జ్యూరీ మెంబర్స్. అయితే బిహేవియర్ ని బట్టి కాదని రీజన్స్ బట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

మరి ఇంకా పలు నామినేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు ఎన్ని గొడవలు జరుగుతాయో..ఎంత రచ్చ జరుగుతుందో.. ఎవరు నామినేషన్ లోకి వస్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =