మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త ఓటిటి లోకి రానుంది.ఈనెల 29నుండి ఈసినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతోపాటు తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.గత నెలలో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈసినిమా మలయాళంలో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.తెలుగులో కూడా విడుదలైయింది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో అభిలాష్ జోషియా తెరకెక్కించిన ఈసినిమాలో ఐష్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా జేక్స్ బిజోయ్,షాన్ రహెమాన్ సంగీతం అందించారు.జీ స్టూడియోస్ తో కలిసి దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్.ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాను చేస్తున్నాడు.అదే లక్కీ భాస్కర్.సార్ తో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన వెంకీ అట్లూరి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: