కన్నడలో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా సప్త సాగరదాచే ఎల్లో.రక్షిత్ శెట్టి,రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈసినిమా ఈ నెల 1న విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ప్రేమకథ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్ డ్రామాగా తెరకెక్కింది.ఇప్పుడు ఈసినిమా తెలుగులో విడుదలవుతుంది.సప్త సాగరాలు దాటి అనే పేరుతో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో విడుదలచేస్తుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.న్యాచురల్ స్టార్ నాని ఈట్రైలర్ ను లాంచ్ చేశాడు.ట్రైలర్ ను లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలతో నింపేశారు.మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాఫై ఆసక్తిని తీసుకురాగలిగింది.మరి కన్నడలో బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతున్న ఈసినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.ఈనెల 22న ఈసినిమా విడుదలకానుంది. తెలుగులో వచ్చే వారం వరకు బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా లేకపోవడం ఈసినిమాకు కలిసి రానుంది.
హేమంత్ ఎమ్ రావు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అచ్యుత్ కుమార్,పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలో నటించగా చరణ్ రాజ్ సంగీతం అందించాడు.హీరో రక్షిత్ శెట్టినే ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: