బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఉల్టా పల్టా అంటూ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ నడిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు వారాలు పూర్తయిపోయి మూడో వారం కూడా మరో రెండు రోజుల్లో పూర్తి చేసుకోబోతుంది. ప్రస్తుతం అయితే మూడో వారం పవరాస్త్ర కోసం హోస్ లో పోటీ జరుగుతుంది. ముందు ప్రిన్స్, అమర్ దీప్, శోభాశెట్టిని పవరాస్త్ర కంటెండర్లుగా ఎంపిక చేసి వారి ముగ్గురిలో ఎవరు అనర్హులో తెలపాలని హౌస్ మేట్లను ఆదేశిస్తున్నాడు బిగ్ బాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ప్రిక్రియలో ప్రిన్స్ పేరు కొంతమంది, శోభాశెట్టి పేరు కొంతమంది, అమర్ దీప్ పేరు కొంతమంది చెబుతారు. ఈనేపథ్యంలోనే తామ్ అర్హులమని నిరూపించుకునే టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈనేపథ్యంలోనే ప్రిన్స్ ఒక బల్లపై తన చిన్ పెట్టి గంటసేపు కదలకుండా నిలబడాలి. ఈ లోపు ప్రిన్స్ ను అనర్హుడని చెప్పినవారు డిస్టర్బ్ చేయొచ్చు. అవన్నీ తట్టుకొని ఉంటేనే టాస్క్ విన్ అవుతాడు. అయితే ప్రిన్స్ అవన్నీ తట్టుకొని టాస్క్ గెలుస్తాడు.
ఆతరువాత శోభా శెట్టికి స్పైసీ చికెన్ తినాలనే టాస్క్ ఇస్తాడు. ఇక ఈటాస్క్ లో కారం గా ఉన్నా తట్టుకొని 27 పీసెస్ తింటుంది శోభాశెట్టి. అయితే శోభాశెట్టిని అనర్హురాలు అని చెప్పిన వారికి కూడా ఈ టాస్క్ ఇచ్చి ఎవరు శోభాశెట్టి కంటే తక్కువ టైమ్ లో తింటారో వారు కంటెండర్ గా సెలక్ట్ అవుతారని చెబుతాడు. దీనిలో భాగంగానే శోభాశెట్టిని అనర్హురాలు అని చెప్పిన గౌతమ్, ప్రశాంత్, శుభశ్రీకి చికెన్ పీసెస్ పంపిస్తాడు. ఈటాస్క్ కు సంచాలకుడిగా సందీప్ ను నియమిస్తాడు బిగ్ బాస్. అయితే గౌతమ్ 28 పీసెస్ తిని బెల్ కొడతాడు. కానీ సంచాలకుడిగా ఉన్న సందీప్ ఒక పీస్ సరిగా తినలేదని 27 పీసెస్ నే కౌంట్ చేస్తూ శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేదని చెప్పడంతో శోభాశెట్టి పవరాస్త్ర పోటీలో నిలుస్తుంది.
మరోవైపు మూడో కంటెండర్ గా ఉన్న అమర్ దీప్ కు గుండు కొట్టించుకోవాలని ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. లేకపోతే తనను అనర్హుడు అని చెప్పిన ప్రియాంక్ హెయిర్ కట్ చేయించుకోవాలని ఆదేశించారు. ఇక అమర్ దీప్ గుండు కొట్టించుకోవడానికి నిరాకరించడంతో ప్రియాంక హెయిర్ కట్ చేయించుకుంటుంది.
దీంతో ఫైనల్ గా మూడో వారం పవరాస్త్ర పోటీలో ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ నిలుస్తారు. నేడు వీరిముగ్గురికి మరో టాస్క్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. వీరి ముగ్గురిలో ఎవరు అనర్హులో తెలుపుతూ ఒక నిర్ణయానికి వచ్చి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. చూడబోతే ఈరోజు ప్రిన్స్ బాగానే హడావుడి చేసేలా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి ఈవారం పవరాస్త్రను ఎవరు గెలుచుకుంటారో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: