దేవరతో AI ఇల్యూజన్ ఆట

devara ai illusion photos goes viral

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది పైన అయిపోయింది. అప్పటికే ఆర్అర్ఆర్ సినిమా కోసమే చాలా ఏళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుంత ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ న క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమలో పలు ప్రత్యేకతల గురించి తెలియచేయగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ రెండు ఫొటోలను షేర్ చేశారు. ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అంటూ ఎన్టీఆర్ ఫేస్ ను క్రియేట్ చేశారు. ఫొటోలో సముద్రతీరం, పడవలు, సూర్యస్తమం ఉండగా వాటిని గమనిస్తే ఎన్టీఆర్ ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 9 =