బిగ్ బాస్7- బఫూన్స్ అంటూ రెచ్చిపోయిన రతిక.. హౌస్ మేట్స్ ఆగ్రహం

bigg boss 7 rathika rose angry on housemates

హౌస్ లో రెండు రోజుల నుండి పవరాస్త్ర కోసం టాస్క్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. పవరాస్త్రలో భాగంగా మాయస్త్ర అనే టాస్క్ ను ఇచ్చాడ. అందులో పలు టాస్క్ లు ఇచ్చి ఆ టాస్కుల్లో గెలిచిన టీమ్ ఫైనల్ గా వపరాస్త్రను గెలుచుకునే పోటీ ఉంటుంది. ఈనేపథ్యంలోనే రణధీర, మహాబలి అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి పుల్ రాజా పుల్, మలుపులో ఉంది గెలుపు అనే టాస్క్ లు ఇవ్వగా.. రెండు టాస్కుల్లో రణధీర టీమ్ గెలవడంతో ఆటీమ్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్ లు పవరాస్త్ర పోటీకి ఎన్నికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. పవరాస్త్రకు ఎవరు అర్హులో చెప్పాలని ఓడిపోయిన సభ్యుల చేతులో పెట్టాడు బిగ్ బాస్. రణధీర టీమ్ లో మాయస్త్ర భాగం ఉన్న కంటెస్టెంట్ దగ్గర నుండి ఆ భాగాన్ని తీసుకొని వారు ఎందుకు ఆర్హులు కాదో చెప్పి.. ఎవరికి ఇస్తున్నారో వారు ఎందుకు అర్హులో చెప్పాలని తెలిపాడు బిగ్ బాస్. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ మాయాస్త్ర భాగాలూ ఉంటాయో వారు విజేత అని వారికి రెండో పవర్ అస్త్ర లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే మొదటి పవరాస్త్రతో ఐదు వారాలు ఇమ్యూనిటీ రానుండగా.. ఈ వారం పవరాస్త్రను గెలుచుకున్న వారికి నాలుగు వారాలపాటు ఇమ్యూనిటీ రానుంది.

రతిక రచ్చ
ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ విషయం చెప్పాడో మహాబలి టీమ్ మెంబర్స్ తమ స్ట్రైటజీలతో వచ్చేశారు. ముఖ్యంగా ప్రిన్స్ కు మాత్రం ప్రవరాస్త్ర రాకుండా చేయాలనేదే టీమ్ ప్లామ్. ఇక టాస్క్ లో భాగంగా మొదట శోభ శ్రీ వెళ్లి శోభా శెట్టి దగ్గర ఉన్న మాయస్త్ర భాగాన్ని తీసుకొని ప్రిన్స్ కు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ దగ్గర ఉన్న భాగాన్ని తీసుకొని శివాజీకి ఇచ్చాడు. ఇక ఆ తరువాత మొదలైంది అసలు రచ్చ. రతికను మూడో స్థానంలో వెళ్లమని అడగగా అక్కడ నుండి అసలు గొడవ మొదలైంది. నేను లాస్ట్ లో వెళతానని రతిక ప్లాన్ వేసుకోగా.. లాస్ట్ లో మేము వెళతామని గౌతమ్, తేజ ముందు నువ్వు వెళ్లమని రతికను కన్విన్స్ చేయాలని చూస్తారు కానీ రతిక మాత్రం వినిపించుకోలేదు. ఈ విషయంలో దామిని వర్సెస్ రతిక అన్నట్టు మారింది.

టీఆర్పీ కోసమే ఇదంతా చేస్తున్నావ్ అని దామిని రతికను అనేసింది. అంతేకాదు మూడో స్థానంలో ఎవరు వెళ్లాలని టీమ్ ఓటింగ్ పెట్టుకోగా అందరూ రతికనే వెళ్లాలని కోరారు. ఇక దానితో రెచ్చిపోయిన రతిక టీమ్ పై చాలా మాటలు అనేసింది. వీళ్లందరూ జోకర్స్ లా ఉన్నారు.. టీమ్ లో ఉండాలంటేనే చెండాలంగా ఉంది.. అందరూ బఫూన్స్ అంటూ నోటికొట్టినట్టు తిట్టేసింది. రతిక మాటలకు పక్కనే ఉన్న సందీప్ కలగచేసుకొని రెండు రోజులు వాళ్లతోనే ఉన్నావు ఇప్పుడు బఫూన్స్ అనడం కరెక్ట్ కాదు అని చెప్పగా అయినా వినకుండా తన ధోరణిలో తిట్టుకుంటూనే ఉంది రతిక. ఇక పైనల్ గా సంచాలకుడిగా ఉన్న సందీప్ కూడా మూడో ప్లేస్ లో రతికను రమ్మని కోరగా నేను రానని తెగేసి చెప్పేసింది.

బిగ్ బాస్ ట్విస్ట్
ఇక ఎంతసేపటికీ రతిక వెళ్లకపోవడంతో మూడో ప్లేస్ల్ లో దామిని వెళ్లి ప్రియాంక దగ్గర ఉన్న మాయస్త్ర భాగాన్ని తీసుకొని షకీలాకు ఇస్తుంది. కనీసం నాలుగో ప్లేస్ లో అయినా రతికను వెళ్లమని హౌస్ మేట్స్ కోరగా అప్పుడు కూడా వెళ్లనని చెబుతుంది. దీంతో ఆలస్యమవుతుండంతో బిగ్ బాస్ కలుగచేసుకొని తర్వాత సభ్యుడు ఎవరు రావాలో రణధీర టీమ్ సభ్యులు సెలక్ట్ చేసుకోవమని చెబుతాడు. అంతేకాదు అప్పటివరకూ ఎవరైతో మాయస్త్ర భాగాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇవ్వాలని మెలిక పెడతాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ వల్ల ప్రియాంక, అమర్ దీప్, శోభాశెట్టిల దగ్గర మాయస్త్ర భాగాలు లేకపోవడంతో గేమ్ నుండి తొలగిపోవాల్సి వస్తుంది.

ఇక ఆట నుండి తప్పుకున్నందుకు గాను అమర్ దీప్ ఫైర్ అవుతాడు. రెండు రోజుల నుండి ఆడిందంతా వేస్ట్ అయిపోయిందంటూ రతిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు ప్రశాంత్ కూడా సిల్లీ రీజన్ చెప్పాడంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రియాంక, శోభాశెట్టి అమర్ ను ఓదార్చే పనిలో పడ్డారు.

మరి ఈరోజు ఎపిసోడ్ ఎంత రచ్చగా మారుతుంది.. మిగిలిన ముగ్గురిలో ఈ వారం పవరాస్త్ర ఎవరికి వస్తుంది.. అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here