మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఒకవైపు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ మలయాళం సహా అన్ని భాషల చిత్రాల్లో హీరోగా రాణిస్తున్న క్రమంలో మమ్ముట్టి కూడా కుమారుడికి ధీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో ‘భ్రమయుగం’ పేరుతో ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నేడు మమ్ముట్టి 72వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మమ్ముట్టికి సినీ పరిశ్రమలోని ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మూవీ టీమ్ అద్దిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ‘భ్రమయుగం’ సినిమాలోని మమ్ముట్టి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో మమ్ముట్టి రగ్డ్ లుక్‌లో చాలా భయంకరంగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి మరింత పెంచేలా ఉంది. ఇక మమ్ముట్టి సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ఆయన ‘బజూకా’ అనే గేమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘భ్రమయుగం’ చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. మరో విశేషమేమంటే.. ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసమే నిర్మాత చక్రవర్తి రామచంద్ర ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం.
ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ‘వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్’తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ తదితరులు ఇతర కీలక పాతల్రు పోషిస్తున్నారు. కాగా భ్రమయుగం 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఇక ఈ ఏడాది తెలుగులో అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషించిన విషయం సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: