స్యయంబు- 3నెలల ట్రైనింగ్ కోసం నిఖిల్

nikhil swayambhu movie latest update

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇక ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆసినిమా మాత్రం మంచి విజయాన్ని అందించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే ఈసినిమా మాత్రం నిఖిల్ కెరీర్ లోనే భారీ
స్థాయిలో వస్తున్న సినిమా. స్వయంబు అనే టైటిల్ తో కృష్ణ భరత్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా హిస్టారికల్ నేపథ్యంలో రాబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినప్పుడే అర్థమయింది. ఇక హిస్టారికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాలో ఖచ్చితంగా యుద్దాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే యుద్దవిద్యలు కోసం నిఖిల్ రెడీ అయిపోతున్నాడు. దీనిలో భాగంగానే మూడు నెలల ట్రైనింగ్ కోసం నిఖిల్ వియాత్నం వెళ్లాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వీడియో రిలీజ్ చేస్తూ తెలియచేసింది. మూడు నెలల పాటు అక్కడే ఉండి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకోతున్నట్టు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

కాగా ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =