‘వ్యూహం’ మూవీ రెండో టీజర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma's Vyuham Movie Teaser 2 Released

రామ్ గోపాల్ వర్మ.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్ లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో రంగీలా, సత్య, సర్కార్ వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన ఆయన.. తాజాగా మంగళవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండో టీజర్‌ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ పరిస్థితులు మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో ఈ సినిమాను తీసినట్లు ఈ టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల ఆధారంగా కొన్ని ఘట్టాలను పెట్టినట్లు అర్ధమవుతోంది. అయితే సాధారణంగా వర్మ తన సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో మాత్రం కాంట్రవర్సీ విషయాలను ఎక్కువగా హైలైట్ చేస్తుంటారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ‘వ్యూహం’ సినిమా టీజర్ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో ఏపీలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వర్మ అధికార పార్టీని సమర్ధిస్తున్నట్లుగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యూహం సినిమా టీజర్‌పై ఒకొక్కరు ఒకొక్కలా స్పందిస్తున్నారు. కొందరు దీనిపై పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇవేమి పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ‘వ్యూహం’ సినిమాను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =